Dh4,300 దోపిడి కేసులో ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- April 25, 2021
దుబాయ్: దుబాయ్ లో ఓ ఉద్యోగిపై దాడి చేసి అతని నుంచి Dh4,300 మేర దోచుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన ఆసియా వ్యక్తి కోర్టు విచారణలో ఊరట లభించింది.వాదోపవాదాలు విన్న తర్వాత ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.ఈ కేసు గత జనవరిలో పోలీసుల దృష్టికి వచ్చింది. బాధితుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఒకే ఇరుగు పొరుగు వారే. అయితే...చెత్త వేయటం విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు విచారణలో తేలింది. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం..ఆసియా వ్యక్తి తనకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని కోరాడని, దీంతో తాను నిందితుడి ఇంటికి వెళ్లాలని..అప్పటికే అక్కడ ఉన్న ఐదుగురు ఆసియా వ్యక్తులు తనపై దాడి చేసి పారిపోయారని వివరించారు. ఆ తర్వాత చూసుకుంటే తన దగ్గర ఉన్న Dh4,300 డబ్బులు కనిపించలేదని, దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. అయితే..ఆ సొమ్మను ఆసియా వ్యక్తి తీశాడని కోర్టు ముందు రుజువు కాలేదు. దీంతో చోరీ కేసులో ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







