Dh4,300 దోపిడి కేసులో ఆసియా వ్య‌క్తిని నిర్దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు

- April 25, 2021 , by Maagulf
Dh4,300 దోపిడి కేసులో ఆసియా వ్య‌క్తిని నిర్దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు

దుబాయ్: దుబాయ్ లో ఓ ఉద్యోగిపై దాడి చేసి అత‌ని నుంచి Dh4,300 మేర దోచుకున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో అరెస్టైన ఆసియా వ్య‌క్తి కోర్టు విచార‌ణ‌లో ఊర‌ట ల‌భించింది.వాదోప‌వాదాలు విన్న త‌ర్వాత ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వ్య‌క్తిని నిర్దోషిగా ప్ర‌క‌టించింది.ఈ కేసు గ‌త జ‌న‌వ‌రిలో పోలీసుల దృష్టికి వ‌చ్చింది. బాధితుడు, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇద్ద‌రు ఒకే ఇరుగు పొరుగు వారే. అయితే...చెత్త వేయ‌టం విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. బాధితుడు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం..ఆసియా వ్య‌క్తి త‌న‌కు ఫోన్ చేసి వెంట‌నే ఇంటికి రావాల‌ని కోరాడ‌ని, దీంతో తాను నిందితుడి ఇంటికి వెళ్లాల‌ని..అప్ప‌టికే అక్క‌డ ఉన్న ఐదుగురు ఆసియా వ్య‌క్తులు త‌న‌పై దాడి చేసి పారిపోయార‌ని వివ‌రించారు. ఆ త‌ర్వాత చూసుకుంటే త‌న ద‌గ్గ‌ర ఉన్న Dh4,300 డ‌బ్బులు క‌నిపించ‌లేద‌ని, దీనిపై వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేసిన‌ట్లు వెల్ల‌డించాడు. అయితే..ఆ సొమ్మ‌ను ఆసియా వ్య‌క్తి తీశాడ‌ని కోర్టు ముందు రుజువు కాలేదు. దీంతో చోరీ కేసులో ఆసియా వ్య‌క్తిని నిర్దోషిగా ప్ర‌క‌టించింది కోర్టు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com