కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం...27 మంది మృతి

- April 25, 2021 , by Maagulf
కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం...27 మంది మృతి

ఇరాక్: ప్రపంచదేశాల్లో కరోనా మహమ్మారి భయం ఇంకా తొలగిపోలేదు.ఒకవైపు కరోనా భయపెడుతుంటే మరోవైపు కరోనా ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు మరింత భయపెడుతున్నాయి.ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని ఇబ్న్ అల్ ఖతీబ్ కరోనా ఆసుపత్రిలోని ఐసీయూ యూనిట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 27 మంది కరోనా రోగులు అగ్నికి ఆహుతి కాగా, 46 మందికి పైగా గాయాలయ్యాయి.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com