'ఎక్స్ప్రెస్ రాజా' 50 రోజులు పూర్తిచేసుకుంది..
- March 03, 2016
హీరో శర్వానంద్, సురభి లు జంటగా యు.వి.క్రియెషన్స్ బ్యానర్ లో మేర్లపాక గాంధి దర్శకత్వంలో నిర్మించిన ఎక్స్ప్రెస్ రాజా విడుదలరోజు నుండి పాజిటివ్ టాక్ తో పాటు శర్వానంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ రెవిన్యూ తో సూపర్బ్ కలెక్షన్లతో 50 రోజులు పూర్తిచేసుకుంది. సక్రాంతి బరిలో భారీ కాంపిటేషన్ తో విడుదలయ్యి మెదటి లాభాలు తెచ్చుకున్న చిత్రం గా ముందొరసలో వుండటమే కాకుండా ఎక్సప్రెస్ కలెక్షన్లతో 50 రోజుల పండగని పూర్తిచేసుకుంది. సంక్రాంతి కి పూర్తి వినోదం తో వచ్చిన చిత్రంగా ఫ్యామిలి ఆడియన్స్ ఈ ఘనవిజయాన్ని అందించారు. 50 రోజుల విజయవంతంగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికి చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.దర్శకుడు మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు అందుకున్నారు. అంతేకాకుండా స్క్రీన్ప్లే కొత్తగా వుండటంతో ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యారు. మెదటి 10 నిమిషాలు సినిమా మిస్ కాకూడదని ముందునుండి చెప్పుకుంటూ వచ్చారు. అలానే చిత్రం లో కూడా మెదటి పది నిమిషాలు కీ రోల్ ప్లే చేయటం ఇప్పటి వరకూ తెలుగు లో రాలేదని చెప్పటం విశేషం. శర్వానంద్ స్టైల్ అండ్ ఫెర్ఫార్మ్న్స్ చాలా కొత్తగా వుంది. సురభి నటన అందం చాలా ప్లస్ అయ్యాయి. అలాగే సప్తగిరి, షకలక శంకర్, ధనరాజ్, పోసాని కృష్ణమురళి మరియు బ్రహ్మజి ల పాత్రల పేర్లే చిత్రంలో చక్కిలిగింతలు పెట్టాయి. సినిమా కి హైలెట్ కామెడి అని చెప్పుకోవాలి. ఫ్యామిలి అంతా చూసి మా ఎక్స్ప్రెస్ రాజా చిత్రాన్ని దిగ్విజయంగా 50 రోజులు ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులని మా ధన్యవాదాలు.. అని అన్నారు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







