బహ్రెయిన్‌లో మరో 2 మసీదుల మూసివేత
- April 25, 2021
బహ్రెయిన్: కోవిడ్ నిబంధనలు పాటించటంలో విఫలమవటంతో మరొ రెండు మసీదులను తాత్కాలికంగా మూసివేతస్తున్నట్లు బహ్రెయిన్ ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌతర్న్, నార్తర్న్ గవర్నరేట్లలోని రెండు మసీదుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామన్నారు అధికారులు. కరోనావైరస్ పై పోరాడుతున్న జాతీయ టాస్క్ ఫోర్స్ ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిని గుర్తించేందుకు ఇప్పటికే సంబంధిత బృందాలు ఆయా ప్రాంతానికి వెళ్లాయని వివరించారు. శానిటైజ్ చేసి ఓ వారం రోజుల తర్వాత మళ్లీ మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







