ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 25, 2021
అమరావతి: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీటీ స్కాన్, హెచ్‌ఆర్ సీటీ ధరను రూ.3 వేలుగా నిర్ణయించింది. అంతకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు ఉత్తర్వులు జారీ చేసింది. సీటీ స్కాన్ వివరాలు, కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలను కరోనా డాష్ బోర్డులో నమోదు చేయాలని ఆదేశించింది.
కరోనా రోగి పేరు, ఫోన్ నెంబర్, సిటీ/హెచ్‌ఆర్ సీటీ స్కాన్ ఇమేజి, సీటీ స్కాన్ సైన్డ్ కాపీ వివరాలను డాష్ బోర్డులో నిక్షిప్తం చేయాలని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇది అమలయ్యేలా జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!