ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..
- April 25, 2021
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య ఇకలేవరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఫణిగిరి. వీరయ్య సతీమణి మల్లిక 2008లోనే మరణించారు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1969లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘అగ్గివీరుడు’ చిత్రం ద్వారా మరుగుజ్జు నటుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు వీరయ్య. అనంతరం దాసరి ప్రోత్సాహంతో 'తాత మనవడు' సినిమాలో కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కలిపి ఇప్పటి వరకు 500లకు పైగా సినిమాల్లో నటించారు వీరయ్య. తనదైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అగ్గివీరుడు, తాత మనవడు, రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జాన్ సుందరి వంటి ఎన్నో చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు. వీరయ్య మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్