ఎస్‌ఆర్‌హెచ్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
- April 26, 2021
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా(53) అర్ధశతకంతో అదరగొట్టాడు.కానీ ఆ తర్వాత రిషబ్ పంత్ (37) స్మిత్(34) తో కలిసి ముడో వికెట్ కు 58 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పాడు.అయితే స్మిత్ చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి పరుగులు చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది క్యాపిటల్స్.ఇక ఆ తర్వాత 160 పరుగుల లక్ష్యంతో వచ్చిన సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్(6) ఔట్ అయిన తర్వాత బెయిర్‌స్టో 18 బంతుల్లోనే 38 పరుగులు చేసాడు. కానీ ఆ తర్వాత సన్‌రైజర్స్ ఎప్పటిలాగే మధ్యలో తడబడింది.కానీ వచ్చిన వారు అందరూ వరుసగా పెవిలియన్ కు చేరుకుంటున్న కేన్ విలియమ్సన్ మాత్రం చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. అయితే ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన కేన్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన సమయంలో ఒక్కే పరుగు రావడంతో మ్యాచ్ డ్రా అయ్యింది.
ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో వార్నర్, విలియమ్సన్ బ్యాటింగ్ కు వచ్చి 7 పరుగులు మాత్రమే చేసారు. ఇక సూపర్ ఓవర్ లో 8 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఢిల్లీ జట్టు చివరి బంతికి విజయం సాధించింది. దాంతో ఈ ఐపీఎల్ లో నాలుగో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది సన్‌రైజర్స్.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!