సీట్ బెల్ట్ పెట్టకపోవడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటంపై కెమెరాలతో నిఘా
- April 26, 2021
దోహా: మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనల్ని కెమెరాలతో గుర్తించి, చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కల్నల్ మొహమ్మద్ రాది అల్ హజ్రి మాట్లాడుతూ, సీటు బెల్టు పెట్టకోకపోవడం అలాగే మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. రోడ్లపై పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో తలా ప్రాజెక్ట కింద కెమెరాలను ఏర్పాటు చేసి, ఉల్లంఘనల్ని గుర్తిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు పోకుండా వుండటమే తమ లక్స్యమని ఆయన వివరించారు. గడచిన పదేళ్ళలో మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కాగా, స్పీడ్ లిమిట్ ఉల్లంఘనులకు 500 నుంచి 1000 ఖతారీ రియాల్స్ వరకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









