మే 5 నుంచి భార‌త్-యూఏఈ విమాన టికెట్ల బుకింగ్ షురూ

- April 27, 2021 , by Maagulf
మే 5 నుంచి భార‌త్-యూఏఈ విమాన టికెట్ల బుకింగ్ షురూ

యూఏఈ: భార‌త్ నుంచి యూఏఈ వెళ్లాల‌నుకునే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌. మే 5 నుంచి మ‌ళ్లీ యూఏఈకి స‌ర్వీసుల‌ను న‌డిపేందుకు ఎయిర్ లైన్స్ సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ మేర‌కు ఆయా సంస్థ‌ల వెబ్ సైట్ల‌లో మే 5 నుంచి టికెట్ల బుకింగ్ సౌక‌ర్యం అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే..రోజు రోజుకి మారుతున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో ఎలాంటి నిర్ణ‌యాలు ఉంటాయోన‌ని చాలామందిలో సందేహాలున్నాయి. దీంతో ఇప్పుడే యూఏఈ తిరిగి వెళ్లి ఉద్యోగం చేరేందుకు చాలా మంది సిద్ధ‌ప‌డుతున్నారు. అయితే...ఏప్రిల్ 24 నుంచి ప‌ది రోజుల పాటు భార‌త్ నుంచి వ‌చ్చే విమానాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించగానే ఏప్రిల్ 23, 24 తేదీల్లో యూఏఈ స‌ర్వీసుల‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. అయినా..చాలా మంది టికెట్ బుకింగ్ చేసుకోలేక‌పోయారు. దీంతో వాళ్లంతా మే 5 నుంచి మొద‌ల‌య్యే స‌ర్వీసుల్లో టికెట్ బుకింగ్ చేసుకునేందుకు పోటీప‌డుతున్నారు. ముంబై నుంచి దుబాయ్ న‌డిచే ఎమిరాతి విమాన స‌ర్వీసుల్లో ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు టికెట్లు బుకింగ్ పూర్త‌య్యాయి. అయితే.. సాధార‌ణం కంటే రెట్టింపు ధ‌ర‌లు ఉన్నాయి. బిజ‌నెస్ క్లాస్ టికెట్ల ధ‌ర‌లు 1,46,000 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఎకనామీ క్లాస్ టికెట్ ధ‌ర‌లు 35,000 నుంచి 57 వేల వ‌ర‌కు ఉన్నాయి. అయితే..భార‌త్ కు చెందిన ఎయిర్ వేస్ లో మాత్రం కొంత మేర చౌక‌గానే టికెట్ ధ‌ర‌లు ఉన్నాయి.  ముంబై- దుబాయ్ మ‌ధ్య ప్ర‌యాణానికి కొన్ని ఎయిర్వేస్ లో  Dh590గా ఉంటే..బ‌డ్జెట్ క్వారియ‌ర్స్ స‌ర్వీస్ లో  Dh369 మాత్ర‌మే ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com