అపాయింట్మెంట్ ఉంటేనే వ్యాక్సిన్‌..ఖ‌తార్ క్లారిటీ

- April 28, 2021 , by Maagulf
అపాయింట్మెంట్ ఉంటేనే వ్యాక్సిన్‌..ఖ‌తార్ క్లారిటీ

దోహా: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముంద‌స్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల‌ని ఖ‌తార్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి గుర్తు చేసింది. అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వ్యాక్సిన్ కేంద్రాల‌కు వెళ్ల‌టం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. అంతేకాదు..ప్ర‌భుత్వం సూచించిన కోవిడ్ వ్యాక్సిన్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని అర్హ‌తలు ఉన్న వారికే ప్రాధాన్యం ఉంటుంది. ఖ‌తార్ నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌, ఇండస్ట్రియ‌ల్ ఏరియాలోని వ్యాక్సినేష‌న్ సెంట‌ర్లు, ప్రాధ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో  ఎలిజిబుల్ వ్య‌క్తులు ముందుస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాల‌ని అధికారులు సూచించారు. అయితే..డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ సెంట‌ర్లో కేవ‌లం రెండో డోస్ మాత్ర‌మే ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. డ్రైవ్ త్రూ వ్యాక్సిన్ కేంద్రాల‌కు వెళ్లేవారు ముంద‌స్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవస‌రం లేద‌ని కూడా వెల్ల‌డించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com