అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేక్...
- April 30, 2021
న్యూ ఢిల్లీ: కరోనా మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేక్ పడింది.. అయితే, అవసరాలను అనుగుణంగా కొన్ని ప్రత్యేక విమానాలు, కార్గో విమానాలను నడుపుతూ వచ్చినా.. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇక, ప్రస్తుతం సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోన్న తరుణంలో.. విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది కేంద్రం. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31వ తేదీ అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. దీని ప్రకారం.. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది డీజీసీఏ.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







