177 మంది బిచ్చ‌గాళ్ల అరెస్ట్

- May 02, 2021 , by Maagulf
177 మంది బిచ్చ‌గాళ్ల అరెస్ట్

దుబాయ్: ప‌విత్ర ర‌మ‌దాన్ మాసంలో బీద‌ల‌కు దాన‌ధ‌ర్మాలు చేస్తే రెట్టింపు పుణ్యం వ‌స్తుంది అనేది న‌మ్మ‌కం.అయితే..ఈ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు కొంద‌రు బెగ్గింగ్ ను వృత్తిగా మార్చుకుంటున్నార‌ని దుబాయ్ పోలీసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.బిచ్చ‌గాళ్లు స‌మాజానికి హ‌నిక‌ర‌మ‌న్నారు.బెగ్గర్స్ మాఫియా వ‌ల్లే పిక్ పాకెట్, దొంగత‌నాలు రెట్టింపు అవుతున్నాయ‌న్నారు.ఆర్ధిక స్థితిగ‌తుల‌ను కార‌ణంగా చూపి చ‌ట్టానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే క్ష‌మించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. ప‌విత్ర ర‌మ‌దాన్ మాసం ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 177 మంది బిచ్చ‌గాళ్ల‌ను అరెస్ట్ చేశామ‌న్నారు.అడుక్కోవ‌టం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని..ఎవ‌రైనా బిచ్చ‌మెత్తుకుంటూ ప‌ట్టుబ‌డితే 5000 దిర్హామ్ ల జ‌రిమానా, మూడు నెల‌ల జైలు శిక్ష ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని  పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే బెగ్గింగ్ మాఫియా న‌డుపుతూ..ఇత‌ర దేశాల నుంచి తీసుకొచ్చిన వ్య‌క్తుల‌తో బిచ్చ‌మెత్తించే గ్యాంగుల‌పై కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అలాంటి వారు ఆరు నెల‌ల జైలుశిక్ష‌...10,000 దిర్హామ్ ల జ‌ర‌మానా ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని దుబాయ్ పోలీసులు హెచ్చ‌రించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com