బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
- May 05, 2021
బెంగాల్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ...పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.మమతాతో గవర్నర్ గ్దీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం చేయించారు.ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దీదీ వరుసగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.కోవిడ్ నేపథ్యంలో మమత ప్రమాణ స్వీకారానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. ఇక రేపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు.బెంగాల్లో 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు,బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి.అయితే నందిగ్రామ్‌లో మాత్రం మమతా బెనర్జీ ఓటమిపాలయ్యారు.దీంతో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చాక రీకౌంటింగ్ జరపాల్సిందేనని డిమాండ్లు వచ్చినప్పటికీ అక్కడి రిటర్నింగ్ అధికారి అందుకు ఒప్పుకోకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్‌లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









