'ఖిలాడి` విడుదల వాయిదా
- May 05, 2021హైదరాబాద్: రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో నిర్మితం అవుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా 'ఖిలాడి`. ప్లే స్మార్ట్ అనేది ఈ సినిమా టాగ్ లైన్. రవితేజ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఇది.జయంతీలాల్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ హవీష్ ప్రొడన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావటం విశేషం.నిజానికి ఈ సినిమాను మే 28న విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది.అయితే కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కి అంతరాయం కలగటంతో ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పటు టీజర్ కి అద్భుతమైన స్పందన లభించిన నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో మరో హిట్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు.కోవిడ్ తగ్గగానే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటోంది యూనిట్.
తాజా వార్తలు
- టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. రేపటి నుంచే ప్రారంభం..
- టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. రేపటి నుంచే ప్రారంభం..
- ఈద్ అల్ అదా.. బలి జంతువుల ధరలు తగ్గుతాయా?
- ఫర్వానియాలో పార్క్ చేసిన వాహనాలు దగ్ధం
- Dh4,400 ఆదా.. 3-రోజుల సూపర్ సేల్..!
- 'రోజుకు Dh800 సంపాదించండి': వాట్సాప్ స్కామర్లపై హెచ్చరిక
- బౌషర్లో కార్మికుడు మృతి
- సెంట్రల్ జెడ్డాలో కుప్పకూలిన 5 అంతస్థుల భవనం
- కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి: సీఈవో వికాస్ రాజ్
- హైదరాబాద్లో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ పట్టివేత