జ్వరం లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేసుకోండి: GHMC మేయర్
- May 07, 2021
హైదరాబాద్: ఏమాత్రం స్వల్ప జ్వరం గాని, నలతగానీ ఉంటె వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి గాని, బస్తీ దవాఖానకు గానీ వెళ్లి జ్వర పరీక్షలు చేయించుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో కరోనా కట్టడికై చేపట్టిన చర్యలపై నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులు, గ్రేటర్ పరిధిలోని వైద్యాధికారులతో నిర్వహించిన ఈ సమీక్షాసమావేశంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఇప్పటికే నగరంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటి ఫివర్ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎవరికైనా స్వల్ప జ్వరం ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లలోగానీ, బస్తీ దవాఖానాలో గాని ప్రాథమిక జ్వర పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. జ్వరమున్న వారికి ఉచితంగా కరోనా నివారణ మందుల కిట్ అందచేస్తున్నారని, ఈ మందులను ఐదు రోజులపాటు వాడాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వాక్సినేషన్ కై తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. నగరంలో పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో బల్దియా ఎంటమాలజి, డీఆర్ఎఫ్ విభాగాల ద్వారా హైపోక్లోరైట్ ద్రావకాన్ని స్ప్రేయింగ్ చేయిస్తున్నామని తెలియచేసారు. నగరంలోని బస్తీ దవాఖనాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నందున, బస్తీ దవాఖానాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







