కువైట్: 13% మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
- May 09, 2021
కువైట్ సిటీ: కువైట్ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండో డోసుల కోర్సును పూర్తి చేసిన వారి సంఖ్య 6 లక్షలకు చేరుకుందని అధికారులు వివరించారు. అంటే కువైట్ జనాభాలో 13 శాతం మందికి డబుల్ డోస్ వ్యాక్సిన్ అందినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే..జనాభాల్లో 34.5 శాతం మందికి అంటే దాదాపు 15 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు మూడో విడత ఆక్స్ ఫర్ట్ వ్యాక్సిన్ వచ్చే సోమవారం నాటికి కువైట్ చేరుకునే అవకాశాలున్నాయన్నారు. మూడో బ్యాచ్ లో 3,88,000 డోసులు దేశానికి చేరుకుంటాయని, దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







