ఒమన్ కు భారీ వర్ష సూచన..
- May 09, 2021
ఒమన్: మస్కట్ గవర్నరేట్ పరిధిలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాయల్ ఆస్పత్రి వర్గాలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు
సిద్ధం అయ్యింది. ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు రాయల్ ఆస్పత్రి వర్గాలు ఆన్ లైన్లో ఓ ప్రకటన విడుదల చేశాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ శనివారం జారీ చేసిన హెచ్చరిక ప్రకారం మస్కట్ గవర్నరేట్ పరిధితో పాటు..సౌత్, నార్త్ అల్ బటినా, ఉత్తర అల్ షార్కియా, అల్ బురైమి, అల్ ధహిరా ప్రాంతాల్లో రాబోయే కొద్ది గంటల్లో తుఫాన్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సమయంలో 30- 45 నాట్ల వేగంతో గాలులలు వీస్తాయని పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







