సంపూర్ణేష్ బాబు హీరోగా 'క్యాలీఫ్లవర్'
- May 09, 2021హైదరాబాద్: తొలి చిత్రం 'హృదయకాలేయం'తో బర్నింగ్ స్టార్ గా గుర్తింపు పొందాడు సంపూర్ణేష్ బాబు.మే 9 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనతో కొత్త సినిమాను ప్రకటించింది మధుసూదన క్రియేషన్స్ సంస్థ.'క్యాలీఫ్లవర్' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ బ్యాంగ్ ను వీడియో గా విడుదల చేశారు దర్శకనిర్మాతలు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంపూర్ణేష్ ఇంగ్లీష్ మేన్ గా దర్శనం ఇవ్వటం విశేషం. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్.కె మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు.గూడురు శ్రీధర్ సమర్పకునిగా వ్యవహరించనున్నారు.వాసంతి హీరోయిన్ గా నటించే ఈ సినిమాకు ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు.ముజీర్ మాలిక్ కెమెరామేన్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇటీవల లాంఛనంగా మొదలైంది. పోసాని, పృధ్వీ, నాగమహేశ్, గెటెప్ శ్రీను, రోహిణి, కాదంబరి కిరణ్, విజయ్, కళ్యాణి ఇందులో ఇతర ముఖ్య పాత్రధారులు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో విప్రో విస్తరణ
- ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం