బెంగళూరులో ప్రమాదకర స్థాయిలో కోవిడ్
- May 10, 2021
బెంగుళూరు: కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.కేసులు పెరుగున్న సమయంలో కట్టడికి సంపూర్ణ లాక్డౌన్ ఒక్కటే పరిష్కరమని నిపుణులు హెచ్చరించడంతో కర్ణాటక సర్కార్ లాక్‌డౌన్‌ను విధించింది.నిన్నటి రోజున కర్ణాటకలో 47 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.బెంగళూరు అర్బన్ ప్రాంతంలో ఏకంగా 20 వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.కరోనా కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్య కూడా బెంగళూరు నగరంలో పెరుగుతోంది.మే 17 నాటికి కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.ఇక జూన్ 11 నాటికి బెంగళూరులో కరోనా కరోనా మరణాలు 14 వేలకు పైగా నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.మొదట ఈ సంఖ్య 26 వేలకు పైగా ఉంటుందని అంచనా వేసినా, లాక్డౌన్ అమలు చేస్తున్నందువల్ల ఈ సంఖ్య 14వేలకు పడిపోవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







