వైద్య రంగం బలోపేతం: కల్వకుంట్ల కవిత
- May 10, 2021
హైదరాబాద్: హైటెక్స్ లోని న్యాక్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐఏహెచ్ వీ సంస్థలు ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైటెక్స్ లో గల న్యాక్ లో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యుమన్ వాల్యూస్(ఐఏహెచ్ వీ) సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన 'ధ్యానం'లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువ వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికీ ఐదు కిలోల చొప్పున, వచ్చే రెండు నెలల పాటు ఉచిత బియ్యం అందించనున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. కోవిడ్ పేషంట్లకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐఏహెచ్వీ సంస్థలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ సైతం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







