ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బహ్రెయిన్ బృందం

- May 12, 2021 , by Maagulf
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బహ్రెయిన్ బృందం

బహ్రెయిన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ ను బహ్రెయిన్ బృందం విజయవంతంగా అధిరోహించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బృందంలో బహ్రెయిన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ హమద్ మొహమ్మద్ అల్ ఖలీఫా తో పాటు బహ్రెయిన్ రాయల్ గార్డ్ సభ్యులు ఉన్నారు. మొత్తం 16 మంది ఉన్న బృందంలో నలుగురు మినహాయి పన్నెండు మంది పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్ పర్సన్ మింగ్మా షెర్పా తెలిపారు. మిగిలిన నలుగురు ఆనారోగ్య కారణాలతో తుది వరకు ప్రయాణం కొనసాగించలేకపోయారని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com