ఖతార్ ఎయిర్‌వేస్ కీలక ప్రకటన
- May 12, 2021
దోహా: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖతార్ ఎయిర్‌వేస్ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతా భావంగా లక్ష టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న హెల్త్ వర్కర్ల సేవా భావానికి ప్రతిఫలంగా తమవంతుగా కాప్లిమెంటరీ రౌండ్‌ట్రిప్ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బాకర్.. కష్టకాలంలో కఠిన శ్రమకోర్చి పూర్తి నిబద్ధతతో, సేవా నిరతితో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఖతార్ ఎయిర్‌వేస్ ధన్యవాదాలు తెలుపుతోంది.వారు చూపుతున్న దయ, అంకితభావం విలువకట్టలేనిది.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు వారు కాపాడుతున్నారు. అలాంటి వారికోసం లక్ష టికెట్లు కేటాయించామని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు,నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందికి రెండు చొప్పున టికెట్లు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.ఇందుకోసం వారు అప్లికేషన్ ఫాం నింపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఇందులో నుంచి ఎంపిక చేసిన వైద్య సిబ్బందితో పాటు మరొకరు ఎకానమీ క్లాసులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచ వ్యాప్తంగా ఖతార్ ఎయిర్‌వేస్ అన్ని విమానాల్లో ఈ వెసలుబాటు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.అంతేగాక దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా ప్రయాణించేందుకు టికెట్లు బుక్‌చేసుకున్న హెల్త్ వర్కర్లకు 35 శాతం రాయితీ ఇస్తున్నట్లు అల్ బాకర్ తెలిపారు.అయితే నవంబరు 26కు ముందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుందని స్పష్టం చేశారు.డిసెంబరు 10 వరకు ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు.ఇక ఈ ఆఫర్ వివరాల కోసం ఖతార్ ఎయిర్‌వేస్ https://www.qatarairways.com/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని...మే 11 నుంచి మే 18 వరకు వారం రోజుల పాటు ఈ ఆఫర్ ఉంటుందని వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!









