రెండు భాగాలుగా ‘పుష్ప’
- May 12, 2021
‘పుష్ప’ రిలీజ్ గురించి గత కొన్నిరోజుల నుంచి వరుస కథనాలు చక్కర్లుకొడుతోన్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై చిత్ర నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘పుష్ప’ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు చెప్పారు.
‘‘ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ‘పుష్ప’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ‘పుష్ప’ ఓ భారీ కథ. దీన్ని కేవలం రెండున్నర గంటల సమయంలో చూపించలేం. కాబట్టి చిత్ర దర్శకుడు సుకుమార్ చెప్పిన విధంగా మా ఈ చిత్రాన్ని రెండు భాగాల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని రవిశంకర్ తెలిపారు. రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ రావడంతో బన్నీ అభిమానులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరిస్థితులు అన్ని సక్రమంగా ఉంటే.. ఆగస్టు 13న ‘పుష్ప’ను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించింది. అయితే కరోనా పరిస్థితుల రీత్యా సినిమా విడుదలపై ఎలాంటి స్పష్టత రాలేదు. ‘పుష్ప’ పార్ట్-1 ఈ ఏడాది..రెండో పార్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు









