ఆక్సిజన్‌ ఆన్‌వీల్స్‌ వాహనాలను ప్రారంభించిన సీపీ మహేష్‌ భగవత్‌

- May 14, 2021 , by Maagulf
ఆక్సిజన్‌ ఆన్‌వీల్స్‌ వాహనాలను ప్రారంభించిన సీపీ మహేష్‌ భగవత్‌

హైదరాబాద్‌: సకాలంలో ప్రాణవాయువు అందక కరోనా రోగులు కొందరు చనిపోతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సకాలంలో ఆక్సిజన్‌ సరఫరా చేయడానికి ఉచిత వాహన సర్వీసును ప్రారంభించారు. మహీంద్రా లాజిస్టిక్స్‌ మరియు రాచకొండ పోలీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ఆన్‌ వీల్‌ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నాలుగు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆక్సిజన్‌ ఆన్‌వీల్స్‌ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ రీఫిల్లింగ్‌ ప్లాంట్స్‌ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడం, ఖాళీ అయిన సిలిండర్లను రీఫిల్లింగ్‌ ప్లాంట్స్‌కు తరలించడం ఈ వాహనాల ముఖ్య ఉద్దేశం అన్నారు. వాహన సేవలు అవసరమైన వారు కోవిడ్ కంట్రోల్‌ నంబర్‌ 9490617234, మహీంద్రా లాజిస్టిక్స్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91-7386420259 లో సంప్రదించాలన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com