భారత్‌లో కోవిడ్…WHO ఆందోళన
- May 15, 2021
జెనీవా: భారత్ లో కాస్త పాజిటివ్ కేసులు తగ్గినా.. రికవరీ కేసులు పెరిగినా.. కరోనా విలయం మాత్రం కొనసాగుతూనే ఉంది.సెకండ్ వేవ్‌లో ఇవాళ కూడా 3 లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.అయితే, భారత్‌లో కరోనా మహమ్మారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని.. ఆస్పత్రులపాలయ్యేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందని. కోవిడ్ బారినపడి మృతిచెందేవారి సంఖ్య కూడా అధికంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు WHO చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిస్.. ఇదే సమయంలో.. కరోనా సోకిన మొదటి సంవత్సరం కంటే.. రెండో సంవత్సరంలో మరింత ప్రమాదకరంగా ఉంటుందని, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించారు టెడ్రోస్.మరోవైపు.. భారత్ లో కరోనా ఉధృతిని అడ్డుకోవడానికి WHO పూర్తిస్థాయిలో సహకరిస్తోందని.. ఇప్పటికే వేల సంఖ్యలో ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్స్‌ను సరఫరా చేశామని.. మొబైల్ హాస్పిటళ్లకు టెంట్లు, మాస్క్‌లు, మెడికల్ సామాగ్రిని కూడా సమకూర్చినట్టు వెల్లడించారు.ఇక, భారత్‌కు WHO పంపించిన ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్స్, మందులు, మాస్క్‌లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







