అప్పటి నుంచి డీఆర్డీవో 2డీజీ డ్రగ్ లభ్యం
- May 15, 2021
కరోనాకు చెక్ పెట్టేందుకు క్రమంగా కొత్త వ్యాక్సిన్లు,మందులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.ఇప్పటికే భారత రక్షణ సంస్థ డీఆర్డీవో భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్స కోసం 2డీజీ డ్రగ్ ను తయారు చేయగా.. తాజాగా.. 2డీజీ డ్రగ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది.పౌడర్ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. 10,000 మోతాదుల మొదటి బ్యాచ్‌ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక, 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి… హైదరాబాద్ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీవోకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ మందును అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే కాగా.. 2-డీజీ ఔషధ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి కూడా లభించింది.

ఈ మందు కనుక అనుకున్న విధంగా పని చేస్తే, కరోనా వైరస్ చిన్న జలుబుకంటే చిన్న జబ్బుగా మారిపోతుంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్సులో (మందు పరీక్షలో)ఇది అధ్బుతంగా పని చేసింది.కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంలో ఈ 2-డీజీ డ్రగ్ కూడా కీలక భూమికి పోషించనుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







