మే 17 నుంచి ‘షిషా సర్వింగ్’కి అనుమతి

- May 15, 2021 , by Maagulf
మే 17 నుంచి ‘షిషా సర్వింగ్’కి అనుమతి

జెడ్డా: కరోనా నేపథ్యంలో బ్యాన్ విధించబడిన షిషా సెర్వింగ్.. త్వరలో తిరిగి అందుబాటులోకి రానుంది. మే 17 నుంచి షిషా సెర్వింగ్ చేయొచ్చని పేర్కొంటూ ఈ మేరకు అథారిటీస్ రెస్టారెంట్లు అలాగే కేఫ్ లకు అనుమతులు మంజూరు చేస్తున్నాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ అండ్ హౌసింగ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ షిషాని అనుమతిస్తారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే షిషా కేంద్రాల్లోకి అనుమతించాలి. షిషా సెంటర్లలో పనిచేసే కార్మికులు కూడా ఇమ్యునైజ్ అయి వుండాలి. అలా కాని పక్షంలో ప్రతి వారం కరోనా టెస్ట్ చేయించుకుని, ఆ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తమ వెంట వుంచుకోవాలి. వాడి పారేసే షిషా హోసెస్ మాత్రమే వినియోగించాల్సి వుంటుంది. ఐదుగురు కంటే ఎక్కువ వ్యక్తులను గ్రూపుగా అనుమతించకూడదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com