రెజ్యూమ్ ఇలా తిరస్కరణకు గురవ్వొచ్చు
- March 04, 2016
దుబాయ్‌లో ఉద్యోగం సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. 200 దేశాలకు చెందిన ఔత్సాహికులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు దుబాయ్‌లో. అందులో మీ ప్రత్యేకతను చాటుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు. ఒకే రకమైన క్వాలిఫికేషన్, టాలెంట్ ఉన్నా కొన్ని సందర్భాల్లో మీ అప్లికేషన్ తిరస్కరణకు గురవ్వొచ్చు. అలాంటి ఐదు కారణాలేంటో చూద్దాం.
1. రెజ్యూమ్ పుస్తకం కాదు. మీకు సంబంధించిన మేగ్జిమమ్ వివరాల్ని, అతి తక్కువ స్పేస్‌లోనే అర్థమయ్యేలా పొందుపర్చాలి. పుస్తకంలా రెజ్యూమ్ రాస్తే, అది చదివేంత తీరిక అవతలి వ్యక్తులకు ఉండదు.
2. ఎక్స్‌పీరియన్స్ పేరుతో ల్యాగింగ్ అనవసరం. రకరకాల ఉద్యోగాలు చేసినవారు, ఆ వివరాలన్నిటినీ పొందుపరుస్తుంటారు. అయితే ఏ ఉద్యోగానికి వెళుతున్నామో, దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ చూపించేందుకు, ఆ వివరాల్ని పేర్కొంటే సరిపోతుంది.
3. స్పెల్లింగ్, గ్లామర్ ముఖ్యం. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ రెజ్యూమ్స్‌లో కీలకం. ఇవి లేకుండా చూసుకోవాలి. రెజ్యూమ్‌ని ఫైనల్ చేసి, సబ్‌మిట్ చేసేముందు ప్రూఫ్ రీడింగ్ చేసుకోవాలి.
4. కెరీర్‌లో సాధించిన విజయాల గురించి పేర్కొనేటప్పుడు చిన్న చిన్న విషయాల్ని పక్కన పెట్టండి. ముఖ్యమైన విషయాల్ని గురించి వివరంగా పేర్కొండి. సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించిన తీరుని వివరించండి. ఏం చేసినా, సింపుల్‌గా అర్థమయ్యేలా ఉండాలని మాత్రం మర్చిపోకండి.
5. కాపీ రెజ్యూమ్స్ మంచిది కాదు. ఇంటర్నెట్‌లోకి వెళ్ళి అక్కడ కన్పించే సవాలక్ష రెజ్యూమ్స్‌లో ఏదో ఒకటి పికప్ చేసి, దాంట్లోంచి కాపీ కొట్టేయాలన్న ఆలోచన శ్రేయస్కరం కానే కాదు. మీ ఆలోచనల్ని ప్రతిబింబించేలా మీ రెజ్యూమ్ ఉండాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత మీరు ఎలా మీ ఉద్యోగంలో దూసుకెళ్తారో పేర్కొనడం మర్చిపోవద్దు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









