యూఏఈ: ఎల్పీజీ సిలిండర్లకు కొత్త మార్గదర్శకాలు జారీ
- May 15, 2021
దుబాయ్: ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్ కు సంబంధించి దుబాయ్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ-డిఎస్‌సిఇ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తగా జారీ అయిన ఆదేశాల ప్రకారం..ఎల్‌పిజి సిలిండర్లు అనుమతి పొందిన నిర్ణీత ఎల్‌పిజి ఫ్యాక్టరీలలో రీఫిల్ చేస్తేనే డిస్ట్రిబ్యూట్ కు అవకాశం ఉంటుంది. సిలిండర్ల రీఫిల్ విషయంలో అత్యధిక భద్రత ప్రమాణాలు పాటించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ తాజా ఆదేశాలు జారీ చేసినట్లు డిఎస్‌సిఇ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎల్‌పిజి ఫ్యాక్టరీలలో రీఫిల్ కు సంబంధించి తగిన భద్రత ప్రమాణాలు అనుసరిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదిలాఉంటే..ఎల్పీజీ దాని అనుబంధ సంస్థల నుంచి డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్ ల జారీ లేదా రెన్యూవల్ పొందాలంటే డిఎస్‌సిఇ నుంచి లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరి అని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







