గాజాసిటీ పై ఇజ్రాయెల్ దాడులు
- May 15, 2021
గాజా సిటీ: గాజాసిటీ పై ఇజ్రాయెల్ దాడులను పెంచింది.ఇక్కడి అంతర్జాతీయ మీడియా కార్యాలయాలపై శనివారం వైమానిక దాడులు జరిపించింది.అల్-జజీరా టీవీ వంటి పలు మీడియా ఆఫీసులు ఈ దాడుల్లో దెబ్బ తిన్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ సహా ఇంకా స్థానిక కార్యాలయాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.జలాల్ టవర్ అనే 13 అంతస్థుల ఈ భవన యజమాని జవాన్ మెహదీని ఇజ్రాయెల్ అధికారులు ఓ గంట ముందుగా హెచ్చరించి వీటిలోని సిబ్బందిని ఖాళీ చేయాల్సిందిగా కోరారట.లేని పక్షంలో బాంబుల వర్షం కురిపిస్తామని గట్టి వార్నింగ్ ఇఛ్చారట. ఇక్కడి ఓ శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడిలో 10 మంది సభ్యులున్న కుటుంబమంతా హతులు కాగా కుటుంబ పెద్ద ఒకరు, 5 నెలల ఓ శిశువు మాత్రం బతికి బయట పడ్డారు. అమాయకులైన తాము ఏం చేశామని ఆ కుటుంబ పెద్ద ఆవేదనగా చెప్పాడు.తాము సాధారణ పౌరులమని, ఈ పోరాటం గురించి తమకేమీ తెలియదని ఆయన అన్నాడు.అయితే హమాస్ టెర్రర్ ఆర్గనైజేషన్ కు చెందిన అధికారులు ఈ శిబిరాన్ని వినియోగించుకుంటున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

హమాస్ వర్గం ఇజ్రాయెల్ పైకి 2 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో 10 మంది ఇజ్రాయెలీలు మరణించారు. కాగా- ఆరు రోజులుగా సాగుతున్న ఈ పోరులో 39 మంది పిల్లలతో సహా 139 మంది పాలస్తీనీయులు మృతి చెందారు.1000 మందికి పైగా గాయపడ్డారు.ఇప్పట్లో తాము గాజా సిటీపై దాడులను ఆపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







