ట్యాక్సీల్లో క్యాష్ లెస్ చెల్లింపులు నేటి నుంచి ప్రారంభం
- May 16, 2021
యూఏఈ: యూఏఈలోని ట్యాక్సీలో ప్రయాణించే వారు నేటి నుంచి క్యాష్ లెస్ చెల్లింపులు నిర్వహించవచ్చు. ఈ మేరకు మున్సిపాలిటీస్, రవాణా శాఖ విభాగంలోని సమీకృత రవాణా కేంద్రం నగదు రహిత చెల్లింపులకు సంబంధించి సూచనలు చేసింది. ట్యాక్సీ ప్రయాణికులు పేబై యాప్ ద్వారా మే 16 నుంచి డబ్బులు చెల్లించొచ్చని ప్రకటించింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ కార్డులను పేబై అకౌంట్ కు యాడ్ చేసుకోవటం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. క్రెడిట్ కార్డులు లేని వారు తమ బ్యాంక్ కార్డుల ద్వారా పేబై వాలెట్ కు డబ్బులు పంపించి వాలెట్ తో ట్యాక్సీ ఛార్జ్ లను చెల్లించొచ్చు. లేదంటే కియోస్క్ ద్వారా నగదును పేబై వ్యాలెట్ లో జమ చేసి కూడా ట్యాక్సీ ఛార్జ్ లను యాప్ ద్వారా చెల్లించొచ్చని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









