J&J, మోడెర్న వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటకుల రాకకు సౌదీ అనుమతి
- May 19, 2021
సౌదీ: వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటకులను దేశంలోకి అనుమతించే నిబంధనలను సౌదీ ప్రభుత్వం అప్ డేట్ చేసింది. ఇక నుంచి అమెరికాకు చెందిన జాన్సన్&జాన్సన్, మోడెర్న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటకులను కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించేందుకు కింగ్డమ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఫైజర్ బయోన్టెక్, అస్ట్రాజెన్కా వ్యాక్సిన్లు తీసుకున్న పర్యాటకులకు మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చిన సౌదీ..లేటెస్ట్ గా జాన్సన్& జాన్సన్, మోడెర్న వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటకులను కూడా అదే జాబితాలో చేర్చించింది. అంటే సౌదీ ఆరోగ్య శాఖ అనుమతి పొందిన ఆయా వ్యాక్సిన్ తీసుకున్న టూరిస్టులు, రెసిడెంట్స్, విజిటర్స్ కింగ్డమ్ కు వెళ్లినప్పుడు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం ఉండదు. అయితే..సౌదీ అనుమతి లేని వ్యాక్సిన్ తీసుకున్న నాన్-సౌదీలు మాత్రం తప్పకుండా క్వారంటైన్ నిబంధన పాటించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







