పిల్లలకు కరోనా సోకినా తీవ్ర లక్షణాలు ఉండవు - నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌

- May 19, 2021 , by Maagulf
పిల్లలకు కరోనా సోకినా తీవ్ర లక్షణాలు ఉండవు - నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌

భారత్: చిన్నపిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు ఉండవని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. పిల్లల్లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందన్నారు. అయితే వైరస్‌ తన స్వభావాన్ని మార్చుకుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని, అందువల్ల దానిపై కన్నేసి ఉంచాలన్నారు. తాము ఇప్పుడు అదే పనిలో ఉన్నామని.. వైరస్‌లోని మార్పులను అర్థం చేసుకొని ఎలా స్పందించాలో అలా స్పందిస్తామని పేర్కొన్నారు. సింగపూర్‌ వైరస్‌ రకం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మూడో ఉద్ధృతి రూపంలో అది భారత్‌ను తాకొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

''పసి పిల్లలకు వైరస్‌ సోకినప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. వయసు పెరిగేకొద్దీ లక్షణాలు పెరుగుతూపోతాయి. వయసు తక్కువ ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకినా.. అది ఉన్నట్లే తెలియదు. వయసు తగ్గేకొద్దీ లక్షణాలు తక్కువైపోతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే సరళి ఉంది. డిసెంబరులో 10 ఏళ్లలోపు వారిపై సర్వే చేసినప్పుడు పెద్దల్లో ఎంత మేర జీరో పాజిటివిటీ రేటు కనిపించిందో పిల్లల్లోనూ అంతే కనిపించింది. దీన్నిబట్టి పిల్లలకూ ఇది సోకుతోంది కానీ లక్షణాలు కనిపించడం లేదు. పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చాం. 10-15రోజుల్లో ఈ ప్రయోగాలు ప్రారంభమవుతాయి. మేం ఇంకా సింగపూర్‌ రకం వైరస్‌పై అధ్యయనం చేయలేదు. అధికారిక సమాచారం అందిన అనంతరం పరిశీలించి స్పందిస్తాం'' అని వీకే పాల్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com