కోవిడ్ ను జయించిన వారికి ప్రత్యేక రివార్డ్
- May 20, 2021
విజయవాడ: కృష్ణా జిల్లా యంత్రాంగం జిల్లాలో 7 కేంద్రాల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొంది కోవిడ్ ను జయించి ఇళ్లకు చేరుకున్న వారిలో గత సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ సమక్షంలో నిర్వహించిన మొదటి వారం లక్కీ డిప్ లో విజేతలకు గురువారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బహుమతులు అందజేశారు.

గూడవల్లి కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొంది ఆరోగ్యం గా ఇళ్లకు చేరుకున్న నిడమనూరు కు చెందిన కె.సూర్యనారాయణ, చంద్రర్లపాడు మండలం కొడవలకల్లు గ్రామానికి చెందిన ఏ.వెంకట నరసింహ,తెలప్రోలు గ్రామానికి చెందిన టి. సురేంద్ర లకు మొదటివారం విజేతలకు మొదటి బహుమతి గా రూ.15,000/-,రెండవ బహుమతిగా రూ.10,000/-,మూడవ బహుమతిగా రూ.5,000/-లు చొప్పున మంజూరు చేసిన బ్యాంక్ పత్రాలు కలెక్టర్ ఇంతియాజ్ అందచేశారు.
బహుమతి సొమ్మును నేరుగా విజేతలు బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ విజేతల మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్లో సదుపాయాలు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంఏది తమ పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలు మందుల కన్న ఎక్కువ రోగ నిరోధానికి దోహదపడ్డాయని కోవిడ్ విజేతలు ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ కు తెలుపుతూ,కోవిడ్ కేర్ సెంటర్లో మంచి సదుపాయాలు ఇంట్లో ఉన్న అనుభూతి కలిగించదన్నారు.ఇందుకు ముఖ్యమంత్రి కి,కృష్ణా కలెక్టర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







