12 ఏళ్ల వారికి కూడా డ్రైవ్ త్రూ కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- May 21, 2021
యూఏఈ: ప్రాధాన్య క్రమంలో వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తి చేస్తూ వస్తున్న యూఏఈ ఆరోగ్య శాఖ...ఇప్పుడు పిల్లలకు వ్యాక్సినేషన్ పై ఫోకస్ చేసింది. ఇక నుంచి 12 ఏళ్లు, అంతకు పైబడిన వయసు వారి కోసం అన్ని సేహా కేంద్రాల్లో ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు..దేశవ్యాప్తంగా అన్ని డ్రైవ్ త్రూ కేంద్రాలు, వ్యాక్సిన్ సెంటర్లలో కూడా వ్యాక్సిన్ లభిస్తుందని వెల్లడించింది. 12 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్నవారు ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని, అదే సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకోవాలనే వారికి మాత్రం 16 ఏళ్లు నిండిఉండాలని పేర్కొంది. ఈ రెండు వ్యాక్సిన్లు అబుధాబి హెల్త్ సర్వీస్ కంపెనీ-సెహాలో అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే..ఇటీవలె కోవిడ్ నుంచి కోలుకున్నవారు, క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లు, గర్భిణిలు, వ్యాక్సిన్ తొలి డోస్ సమయంలో అలర్జీ సమస్యలు ఎదుర్కొన్నవారికి వ్యాక్సిన్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







