వరంగల్ ఎంజీఎంలో కరోనా రోగులతో మాట్లాడి, ధైర్యం చెప్పిన కేసీఆర్
- May 21, 2021
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తున్నారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు ఉన్నారు. వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఎంజీఎంలోని సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అడుగుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. కరోనా రోగులు చికిత్స పొందుతున్న వార్డులను కేసీఆర్ పరిశీలిస్తున్నారు.వరంగల్ పర్యటనలో భాగంగ ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఔషధాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.ఎంజీఎం పర్యటన అనంతరం వరంగల్ సెంట్రల్ జైలును పరిశీలించి, జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో మాట్లాడతారు. ఇటీవలే కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







