వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుంది:టి.గవర్నర్
- May 22, 2021
హైదరాబాద్: వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు అన్ని రకాల చర్యలతో ఉత్పత్తిని వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ఈ రోజు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు సంబంధించిన ప్రతినిధులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుండి వస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ ఇలాంటి పలు అంశాలను చర్చించారు. డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ నుండి డిఆర్ డిఓ సంయుక్త భాగస్వామ్యంతో 2 డీజి ఔషధం రావడం, ఇది సంపూర్ణ దేశీయ ముడిసరుకుతో తయారు చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్బర్ భారత్ ఆశయానికి అనుగుణంగా ఉందని గవర్నర్ ప్రశంసించారు. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రతినిధులు తాము ఈ జూలై నెల ఆఖరి వరకు దాదాపు రెండు కోట్ల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులు దిగుమతి చేసుకుంటామని గవర్నర్ కు తెలిపారు. అలాగే ఈ సంవత్సరం ఆఖరి వరకు దిగుమతుల ద్వారా, మన దేశంలోనే తయారీ ద్వారా దాదాపు 15 నుండి 20 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి తెస్తామని గవర్నర్ కు వివరించారు.

తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







