ఏపీలో వ్యాక్సినేషన్ పునఃప్రారంభం
- May 24, 2021
అమరావతి: ఏపీలో నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది.వారం రోజుల నుంచి బ్రేక్ పడిన వ్యాక్సిన్ పంపిణీని నేటి నుంచి తిరిగి ప్రారంభిస్తోంది ప్రభుత్వం.అయితే 3 రోజులపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుండగా హై రిస్క్ కేటగిరీకి చెందిన 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.
ఆర్టీసీ, బ్యాంకింగ్, పోర్టుల్లో పనిచేసే సిబ్బంది, కార్మికులు, ప్రజా పంపిణీ వ్యవస్థ సిబ్బంది, జర్నలిస్టులను హైరిస్క్ కేటగిరీగా గుర్తించింది ప్రభుత్వం.అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 13 లక్షల 13 వేల డోసుల వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి.ఇందులో లక్షా 55 వేల కోవాగ్జిన్ టీకాలను రెండో డోసు కింద, 11 లక్షల 58 వేల కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను మొదటి డోసుగా ఇవ్వనున్నారు.వ్యాక్సిన్ల కొరతతో 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి ప్రస్తుతానికి వ్యాక్సినేషన్ లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







