వ్యాక్సినేషన్ పొందినవారికి దేశంలోకి అనుమతించే విషయమై చర్చ
- May 25, 2021
కువైట్: చెల్లుబాటయ్యే రెసిడెన్సీ కలిగి వుండి, వ్యాక్సినేషన్ పొందిన వలసదారులకు (కొన్ని ఎంపిక చేసిన దేశాలకు చెందినవారికి)దేశంలోకి అనుమతిచ్చే విషయమై అథారిటీస్ చర్చిస్తున్నాయి. ఆస్ట్రా జెనకా, ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర ఆమోదం పొందిన వ్యాక్సిన్లను ఒక డోసు లేదా రెండు డోసులు పొందిన వలసదారులకు, క్వారంటైన్ నిబంధనలతో కూడిన అనుమతిని ఇచ్చేందుకు వీలుగా సంబంధిత అధికారిక వర్గాలు కసరత్తులు ప్రారంభించాయి. హై రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలోకి రానిచ్చే పరిస్థితి లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. సంబంధిత డేటాపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులపై వాకబు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







