షాప్ బిగ్.. విన్ బిగ్.. విజేతలుగా 1600 మంది లులు కొనుగోలుదారులు
- May 25, 2021
మనామా: ‘షాప్ బిగ్ - విన్ బిగ్’ పేరుతో లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన రఫాలె ప్రమోషన్ ద్వారా ఇప్పటివరకు 1600 మంది అదృష్టవంతులైన కొనుగోలుదారులకు 100,000 బహ్రెయినీ దినార్స్ విలువైన లులు గిఫ్ట్ కార్డులను అందించడం జరిగింది. హిద్ ప్రాంతంలోని లులు హైపర్ మార్కెట్ వద్ద నాలుగవ డ్రా నిర్వహించారు. 150 మంది విజేతలు 100 బహ్రెయినీ దినార్స్ విలువైన లులు షాపింగ్ కార్డులు గెలుచుకున్నారు. మరో 150 మంది విజేతలు 50 బహ్రెయినీ దినార్ల విలువైన షాపింగ్ కార్డులను సొంతం చేసుకున్నారు. 100 మంది విజేతలకు 25 బహ్రెయినీ దినార్ల విలువైన లులు షాపింగ్ గిఫ్టు కార్డులు లభించాయి. బహుమతుల కోసం లులు హైపర్ మార్కెట్ హిద్ కస్టమర్ సర్వీస్ కౌంటర్ వద్ద సంప్రదించాల్సిందిగా కొనుగోలుదారులకు నిర్వాహకులు సూచించారు. ప్రతి 5 బహ్రెయినీ దినార్లు ఖర్చు చేసినప్పుడు ఇ-రఫాలె ద్వారా 175,000 బహ్రెయినీ దినార్ల విలువైన లులు షాపింగ్ కార్డుల్ని (25 బహ్రెయినీ దినార్ల నుంచి 100 బహ్రెయినీ దినార్ల వరకు విలువైన) గెలచుకోవడానికి కొనుగోలుదారులకు అవకాశం కలుగుతుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







