తెలంగాణలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా జర్నలిస్టులు
- May 26, 2021
హైదరాబాద్: జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. అటు రాష్ట్రంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా తెలిపారు. ఇక కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాటివిటీ రేటు 4.1శాతంగా ఉందన్నారు. ఇక రికవరీ రేటు 92.52శాతంగా ఉందన్న ఆయన.. మరణాల రేటు 0.56శాతంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు 1.47కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..







