భారత్ లో అందుబాటులోకి రానున్న ఫైజర్ వ్యాక్సిన్
- May 27, 2021
న్యూ ఢిల్లీ: ఫైజర్ వ్యాక్సిన్ భారత్ లో త్వరలో అందుబాటులోకి వచ్చే సూచనలున్నాయని ఈ సంస్థ తెలిపింది.అత్యంత నాణ్యమైన ఈ వ్యాక్సిన్ ను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని, 12 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తీ ఈ వ్యాక్సిన్ ని వాడవచ్చునని పేర్కొంది. 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య దీన్ని నెల రోజులపాటు నిల్వ ఉంచవచ్చునని ఈ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. జులై–అక్టోబర్ మధ్య కాలంలో 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు.అయితే ఐడెంటిఫికేషన్ సహా ఇతర రెగ్యులేటరీ సడలింపులను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఇటీవల కొన్నివారాలుగా భారత అధికారులకు, ఈ సంస్థ ప్రతినిధులకు మధ్య సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయి.ఈ చర్చలో ఈ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా కూడా పాల్గొన్నారు. అత్యవసర వినియోగానికి తమ వ్యాక్సిన్ ను ఇండియాకు అందజేయాలంటే సత్వర ఆమోదాలు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. ఇండియాలోను, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదివరకటి మాదిరి పరిస్థితి సజావుగా లేదని, అందువల్ల కోవిద్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రూవల్ సహా అధికారికంగా తమకు 44 అనుమతులు రావాల్సి ఉందని, కానీ పోస్ట్ అప్రూవల్ కమిటీ పర్మిషన్ అవసరం లేదని ఆల్బర్ట్ పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్ ని వినియోగిస్తున్నారు.
చవకైనదైన ఈ వ్యాక్సిన్ ను ఫ్రిజ్ లో నెల రోజుల పాటు 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచవచ్చునని ఇదివరకే వార్తలు వచ్చాయి.వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్న ఇండియాకు ఈ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని కోట్లాది మంది ఎదురు చుస్తునారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







