8000 మంది విమానాశ్రయ సిబ్బంది లక్ష్యంగా వ్యాక్సినేషన్
- May 28, 2021
కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్న కువైట్ ప్రభుత్వం...ప్రతి రంగంలోని సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేసి పలు రంగాల్లోని సిబ్బందికి వారి దగ్గరికే వెళ్లి వ్యాక్సిన్ ఇస్తోంది. నాలుగోరోజు కార్యచరణలో భాగంగా నేడు విమానాశ్రయ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేపట్టనుంది. మొత్తం 10 మొబైల్ యూనిట్లు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాయి. కువైట్ విమానాశ్రయంలోని నేషనల్ ఏవియేషన్ సర్వీసెస్, కువైట్ ఏవియేషన్ సర్వీసెస్ కో., డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ సిబ్బందితో పాటు ఎయిర్ పోర్టులోని షాపులు, రెస్టారెంట్ల సిబ్బందికి కూడా వ్యాక్సిన్ వేయనున్నారు. మొత్తం 8000 వేల మందికి మొబైల్ వ్యాక్సిన్ యూనిట్ సిబ్బంది వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







