దృష్టి మరలడంతో వాహనదారుడి పైకి దూసుకెళ్ళిన కారు

- May 28, 2021 , by Maagulf
దృష్టి మరలడంతో వాహనదారుడి పైకి దూసుకెళ్ళిన కారు

యూఏఈ: కారు నడుపుతున్న వ్యక్తి దృష్టి మరలడంతో, ఆ కారుని ఓ ద్విచక్రవాహనంపైకి ఎక్కించేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటనకు సంబంధించి అబుదాబీ పోలీస్, ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంగా ఎడమ వైపు లేన్ ద్వారా నిందితుడు తన కారుని పోనిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ, వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా వుండాలని అబుదాబీ పోలీసులు సూచించారు. డ్రైవింగ్ చేస్తూ అద్దంలో మేకప్ సరిచేసుకోవడం, ఫొటోలు తీసుకోవడం లేదా కారులోని ఇతర వ్యక్తులతో మాట్లాడటం వంటి వాటి వల్ల డ్రైవింగ్ చేసేవారి దృష్టి మరలే అవకాశం వుంది. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే 800 దిర్హాముల జరిమానా, 4 బ్లాక్ పాయింట్లు విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com