యూఏఈలో ఐపీఎల్ సెకండాఫ్: బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్

- May 29, 2021 , by Maagulf
యూఏఈలో ఐపీఎల్ సెకండాఫ్: బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్

న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్‌ను పున: ప్రారంభించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.ఇవాళ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా పడిన ఐపీఎల్ 2021ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది.సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది నిర్వహించిన వేదికల్లోనే మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. దుబాయ్‌, అబుధాబి, షార్జా స్టేడియంలలో బయోబబుల్ వాతావరణంలో లీగ్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. మరికొద్ది రోజుల్లో లీగ్, ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. కాగా, ఐపీఎల్ సెకండాఫ్‌కు ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com