క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం రేడీ..

- May 29, 2021 , by Maagulf
క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం రేడీ..

అమరావతి: ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్‌లో ఇంకా భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.మ‌రోవైపు.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అప్ర‌మ‌త్తం అవుతోంది..మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతోంది  ప్రభుత్వం. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అల‌ర్ట్ అయిన  ప్రభుత్వం.. పిడీయాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది.. APMSIDC చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ క‌మిటీ ఏర్పాటైంది.మూడో దశలో చిన్న పిల్లలకు కోవిడ్‌ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ ఏ విధంగా ఉండాలనే అంశాలపై అధ్యయనం చేయ‌నుంది టాస్క్‌ఫోర్స్‌.చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన కరోనా చికిత్సపై వైద్యారోగ్య సిబ్బందికి శిక్షణపై నివేదిక కూడా ఇవ్వ‌నుంది..వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఆదేశించింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com