మక్కా ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకున్న హజ్ స్మార్ట్ కార్డ్
- May 29, 2021
మక్కా: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, ‘మక్కా అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్’ని గెలుచుకుంది. హజ్ స్మార్టు కార్డు సహా వివిధ విభాగాల్లో సాంకేతికంగా ప్రతిభ చూపి, మెరుగైన సేవలందించినందుకుగాను ఈ ఘనత దక్కించుకోవడం జరిగింది. సౌదీ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా డాక్టర్ అబ్దల్ ఫత్తాహ్ బిన్ సులైమాన్ మషత్ మాట్లడుతూ, క్యాంపులను యాక్సెస్ చేయడానికి, వాహనాలు అలాగే హోటల్స్ గురించి సమాచారం తెలుసుకోవడానికీ, ఏటీఎంల వినియోగం, పీఓఎస్ చెల్లింపులకీ వీలుగా ఈ స్మార్టు కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. యాత్రీకుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. చాలా సేవలు, అలాగే సమాచారం ఈ స్మార్ట్ కార్డులో పొందుపరిచారు. స్మార్ట్ యాప్ ద్వారా వీటి యాక్సెస్ వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







