వాట్సాప్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్

- June 01, 2021 , by Maagulf
వాట్సాప్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్

దుబాయ్: దుబాయ్ ఎమిరేట్స్ ప్రజలు ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆటోమెటిగ్గా స్లాట్ బుకింగ్ చేసేలా వాట్సాప్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ-DHA స్పష్టం చేసింది. ఈ సౌకర్యం పొందేందుకు 800 342 నెంబర్ ను ఫోన్ కాంటాక్ట్ లిస్టులో యాడ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయాలి. వ్యాక్సిన్ అపాయింట్మెంట్ కోసం మెడికల్ రికార్డ్ నెంబర్ ను ఖచ్చితంగా పేర్కొవాలి. ఆ తర్వాత లబ్ధిదారులు తమకు అనువైన విధంగా వ్యాక్సినేషన్ సెంటర్, తేదీ, సమయం వివరాలు సెలక్ట్ చేయాలి. ఈ వివరాలన్నింటిని ఎంటర్ చేయగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధిదారులకు సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్ తో పాటు తేది, సమయాన్ని నిర్ధారిస్తూ వ్యాక్సిన్ స్లాట్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com