కోవిడ్ వ్యాక్సిన్: ఎన్నారైలకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎంకు కృతఙ్ఞతలు

- June 02, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్: ఎన్నారైలకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎంకు కృతఙ్ఞతలు

ఏపీ: విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారు, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు సెలవుల పై వచ్చి కరోనా మహమ్మారి కారణంగా తమ స్వస్థలాలలోనే నెలల తరబడి ఉండాల్సి వచ్చింది. వీరంతా తిరిగి విదేశాలకు వెళ్ళాలంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే మన దేశంలో 45 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్ లు వేయడం లేదు.ముఖ్యంగా  వలసకార్మికులు పడుతున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాయి.ఇదే సమయంలో విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్  విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ద్వారా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళింది. అప్పటికే ఈ విషయంపై సమీక్షిస్తున్న సీయం ఆంధ్రప్రదేశ్ నివాసితులై 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల విదేశాలకు వెళ్ళే ఉద్యోగులకు, వారితో పాటు వెళ్ళే కుటుంబ సభ్యులకు మరియు ఉన్నత విద్య కోసం వెళ్ళే  విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ లను వేయాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భముగా APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో APNRTS ఎల్లవేళలా ప్రవాసాంధ్రుల సేవలో ఉంటుందని, NRT లు ఎవరు అయినా వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో ఆధార్ కార్డ్ నంబర్ బదులు తమ పాస్పోర్ట్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించారు. లేదంటే ఆయా దేశాల నిబంధనల ప్రకారము విదేశాలకు వెళ్ళటములో ఇబ్బందులు కలుగుతాయని అన్నారు.అలాగే, 45 సంవత్సరాల లోపు వయసున్న ప్రవాసాంధ్రులు మరియు విద్యార్థులు తమ డ్యాకుమెంట్లలో 1) పాస్పోర్ట్ 2) చెల్లుబాటు అయ్యే వీసా (ఉద్యోగము, బిజినెస్, డిపెండెంట్ లేదా  స్టూడెంట్ ), 3)కొత్త నియామకాల కోసం ఉపాధి ఆఫర్ లేఖ లేదా తిరిగి చేరడానికి యజమాని నుండి వచ్చిన లేఖ, 4) విద్యార్థులకు ప్రవేశ నిర్ధారణ (I20) వంటి పత్రాలను వ్యాక్సిన్ యొక్క ప్రామాణిక పత్రాలుగా పరిగణించి వ్యాక్సిన్ లు వేసే విధముగా అధికారులను ఆదేశించాలని ముఖ్యమంత్రి ని కోరామన్నారు. 

ఇంతకు ముందే ప్రవాసాంధ్రులు ఆధార్ కార్డ్ నంబర్ తో వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే అలాంటివారికి  పాస్పోర్ట్  నెంబర్ తో మరలా  సర్టిఫికెట్ వచ్చేలా  కోవిడ్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని సీయం ని అభ్యర్థించామన్నారు. APNRTS హెల్ప్ లైన్ 24 గంటలు, సంవత్సరం లో 365 రోజులు పనిచేస్తుందని, ప్రవాసాంధ్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు.హెల్ప్ లైన్ నంబర్లు: 0863 2340678, వాట్సాప్ నంబర్: 85000 27678.ప్రవాసాంధ్రులందరి తరపున ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com